ప్రతి ఒక్కరూ అంబేద్కర్ చేసిన సేవల్ని స్మరించుకోవాలని, భావి సమాజానికి ఆ మహోన్నత వ్యక్తి నెలకొల్పిన విలువల్ని అందించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, సమసమాజ స్వాప్నికుడు, భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ వర్దంతి సందర్భంగా బన్సీలాల్ పేటలోని జబ్బార్ కాంప్లెక్స్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. దేశంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసి, నేడు వెనుకబడిన, బలహీన వర్గాలు స్వయం సమృద్ది దిశగా రాణించడానికి బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి మరువలేమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత లక్ష్మీపతి, నాయకులు ప్రేమ్, స్థానిక నాయకులు సుదర్శన్ బాబు, మహేందర్, అశోక్, నవీన్, కర్ణాకర్, వినయ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital