Friday, November 22, 2024

Alay – Balay – తెలంగాణ సంస్కృతి, ఆచారాలు ఎంతో గొప్పవ‌న్న‌ మంత్రి తలసాని ..

హైదరాబాద్‌ : తెలంగాణ సంస్కృతి, ఆచారాలు ఎంతో గొప్పవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో హరియానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ, 2005 సంవత్సరంలో దత్తాత్రేయ ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తుండటం అభినందనీయమన్నారు.

మన సంస్కృతి, సాంప్రదాయాలను పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. చెడు పై మంచి సాధించిన విజయానికి నిదర్శనంగా విజయ దశమి జరుపుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి మన రాష్ట్రం కు చెందిన వారిని మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల కు చెందిన ప్రముఖులను కూడా ఆహ్వానించారని, దీంతో మన సంస్కృతి గురించి వారికి కూడా తెలియజేసే అవకాశం ఉంటుందని చెప్పారు. గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు, వివిధ రకాల వంటకాలను వడ్డించడం చాలా సంతోషించదగ్గ విషయం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement