హైదరాబాద్ జిల్లా క్యాలెండర్‌ను రాష్ట్ర పశు సంవర్థక, పాడి, సినీ పరిశ్రమల శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ ఉదయం ఆంధ్రప్రభ రీజనల్ మేనేజర్ రమేష్ పసునూరి, సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… ఆంధ్రప్రభ బంగారు తెలంగాణ సాధన లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి హితోధికంగా సహకరిస్తుందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సంచలనాత్మక కథనాలను ప్రచురిస్తూ.. సమగ్రంగా వార్తలను ప్రజలకు చేరవేస్తోందని మంత్రి తెలిపారు. అసలైన, నిఖార్సయిన వార్తలతో సుదీర్ఘకాలం రాణించడం అద్భుతమన్నారు. కొవిడ్, లాక్ డౌన్ సమయలోనూ కీలకంగా విధులు నిర్వహించి, ప్రజలను అప్రమత్తం చేసిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తనదైన పంథాను కొనసాగిస్తూ ప్రజల్లో చిరకాలంగా నిలిచి పోయిందన్నారు. తొలి తెలుగు పత్రికగా ప్రజల గుండెల్లో నిలిచి, తెలంగాణ సాధన కోసం, ఆ తరువాత ప్రజల వెంట ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ గ్రేటర్ హైదరాబాద్ బ్యూరో ఇన్‌చార్జి చిట్టిబాబు, ఆంధ్రప్రభ సికింద్రాబాద్ ఇన్‌చార్జి భాస్కర్, జనార్దన్, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital