మహబూబ్ నగర్ – స్వతంత్ర భారత వజ్రోత్సవ కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఒకే రోజు 4.20 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు డివైడర్ వద్ద మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేడు లాంచనంగా ప్రారంభించారు.. ఈ ప్రాంతంలో స్థానికులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి మొక్కలు నాటారు.. అలాగే డివైడర్ ఏర్పాటు సందర్భంగా తొలగించిన చెట్లను సైతం ఈ సందర్భంగా వేరే ప్రాంతంలో మంత్రి నాటారు.
కార్యక్రమంలో కలెక్టర్ జి రవి నాయక్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు గోపాల్ యాదవ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, డిసిసిబి ఇన్చార్జి ఛైర్మన్ వెంకటయ్య, అడిషనల్ కలెక్టర్లు మోహన్ రావు, యాదయ్య, జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, కౌన్సిలర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.