మహబూబ్ నగర్, నవంబర్ 16 (ప్రభ న్యూస్):
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఎమ్మార్పీఎస్ అర్.అర్ మద్దతు తెలిపింది. తామంతా మంత్రికి బాసటగా నిలుస్తామని ఆ సంఘం పేర్కొంది. ఈ సందర్భంగా గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్స్ రోడ్ సమీపంలో ఎమ్మార్పీఎస్ఆర్.ఆర్ అధ్యక్షుడు రాయికంటి రాందాస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారు చేసిన ప్లకార్డులను మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.
అనంతరం రామదాసు మాట్లాడుతూ…బహుజనుల సంక్షేమం ఎంతో కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి, మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ కు తాము మద్దతుగా నిలుస్తామని తెలిపారు.కులమతాలకు అతీతంగా అందరూ బాగుండాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలంటే బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
సచివాలయానికి అంబేద్కర్ పేరు…మంత్రి శ్రీనివాస్ గౌడ్
రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా ఆ మహనీయుని అతి పెద్ద విగ్రహాన్ని హైదరాబాద్ లో ప్రతిష్ఠించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి శ్రీనివాస్ కూడా తెలిపారు.ఈ జాతి మేలుకొలుపు కోసం తాము కష్టపడి పనిచేశామనీ,భవిష్యత్తులోనూ అండగా ఉంటామని తెలిపారు. తనకు మద్దతు తెలిపినందుకు ఎమ్మార్పీఎస్ ఆర్. ఆర్ కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఆర్. ఆర్. అధ్యక్షుడు రాయికంటి రాందాస్, సంగమేశ్వర్, పరమేశ్వర్, అశోక్, అనిల్, చంద్రమ్మ, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.