అంతర్జాతీయ మార్కెట్ లో 2 కోట్ల రూపాయలపై విలువైన సుమారు 5 కిలోల మెపిడ్రిన్ డ్రగ్ ను పట్టుకొని సీజ్ చేసిన రాష్ట్ర అబ్కారీ శాఖ అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి మత్తు పదార్థాలను తయారు చేస్తున్న, రవాణా చేస్తున్న,అమ్మకాలు చేస్తున్న, వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. నిఘా వర్గాల సమాచారంతో సిబ్బంది పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి సుమారు 2 కోట్ల రూపాయల విలువైన 5 కిలోల మెపిడ్రిన్ డ్రగ్ ను పట్టుకొని సీజ్ చేసినందుకు అబ్కారీ శాఖ అధికారులను అభినందనులు తెలిపారు. ఆంధ్ర – ఛత్తీస్ ఘడ్, ఒరిస్సాల నుండి గంజాయి, మొదలైన మత్తు పదార్థాలను తెలంగాణలో రాకుండా సరిహద్దుల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేశామన్నారు.
ఇది కూడా చదవండి: TS: ఆదివాసీలే అడవికి అండ.. వచ్చే నెల 8 నుంచి పోడు దరఖాస్తుల స్వీకరణ