Tuesday, November 19, 2024

TG: హరీష్ రావుకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..

రాష్ట్ర మంత్రి మంత్రి శ్రీధర్ బాబు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగా.. అతనికి ఇటీవల ప్రభుత్వ విప్ పదవి ఇచ్చారు. కాగా దీనిపై హరీష్ స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై, స్పీకర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అయితే హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. రాజ్యాంగానికి లోబడే పట్నం మహేందర్‌రెడ్డిని మండలి చీఫ్‌విప్‌గా నియమించాం. ప్రతి దాన్ని హరీశ్ రావుకు రాజకీయం చేయడం అలవాటుగా మారిందని.. వ్యవస్థలను అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారని, హరీష్‌రావు మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లోకి ఎలా చేర్చుకున్నారని మంత్రి శ్రీధర్‌ బాబు ప్రశ్నించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement