Friday, December 13, 2024

TG | వారి సమస్యలు పరిష్కరిస్తా.. మంత్రి సీతక్క

బాసర, డిసెంబర్ 13 ఆంధ్రప్రభ : విద్యార్థుల సమస్యలను సావధానంగా విని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం మంత్రి మంత్రి సీతక్క ఎమ్మెల్యే రామారావు పటేల్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్సీ దండే విటల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల తో కలిసి యూనివర్సిటీని సందర్శించారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో విద్యార్థులతో మంత్రి సీతక్క మాట్లాడారు.

ఈ సందర్భంగా విద్యార్థులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా సరిపడ ఫాకల్టీ లేకపోవడం పట్ల చదువుకు ఇబ్బందులు కలుగుతున్నాయని, 60శాతం మంది విద్యార్థినీలు ఉన్న యూనివర్సిటీలో రెగ్యులర్ గైనకాలజిస్ట్ ను నియమించాలని, మహిళా కేర్ టేకర్లను నియమించాలని, గతంలో ఉన్న మెస్ యాజమాన్యాలే ఉన్నాయని, వారిని మార్చాలని, మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

విద్యార్థుల సమస్యలను సావధానంగా విన్న మంత్రి విడతల వారీగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మంత్రి తక్షణం కోటి రూపాయలను యూనివర్సిటీకి మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్జీయుకేటి ఇంఛార్జి విసి గోవర్ధన్, విద్యార్థులు ఆర్జియుకేటి అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement