ప్రసిద్ధ క్షైవక్షేత్రామైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకున్నారు. గురువారం ఉదయం ఆమె స్వామివారిని దర్శించుకునేందుకు రాగా ఆలయ అధికారులు ఆమెకు ఘనస్వాగతం పలికారు.
అనంతరం ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి సీతక్కకు వేదపండితులు ఆశీర్వచనలు అందజేశారు. మంత్రిని సన్మానించి స్వామి ప్రసాదంతో పాటు చిత్రపటాన్ని అందజేశారు.