ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమమని తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ అక్రమ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అవతరణే పెద్ద కుట్ర అని, తెలంగాణ నీటిని దోచుకునేందుకే ఆంధ్రప్రదేశ్ ని ఏర్పాటు చేశారని విమర్శించారు. ఏపీ ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. ఏపీ అవతరణతో మహబూబ్ నగర్ జిల్లాలకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఏపీ ప్రాజెక్టులు అక్రమమని, తెలంగాణ నిర్మిస్తున్నవి సక్రమ ప్రాజెక్టులని తెలిపారు. ఆనాడు జలదోపిడీకి సహకరించినవాళ్లు ఇప్పుడు సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టాలంటే కేంద్రం అనుమతిని తీసుకోవాలని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. కేంద్రం ద్వారా నీటి కేటాయింపులను జరిపించుకోవాలన్నారు. ముందు చూపుతో జోగులాంబ బ్యారేజ్ ను కేసీఆర్ ప్రతిపాదించారని చెప్పారు.
జలదోపిడీకి సహకరించిన వాళ్లా కేసీఆర్ ను విమర్శించేది?
By mahesh kumar
- Tags
- Andhra Pradesh government
- AP irrigation projects
- AP NEWS
- AP vs TS
- cm kcr
- important news
- Important News This Week
- Important News Today
- Latest Important News
- Mahabubnagar Latest News
- Mahabubnagar Local News
- Mahabubnagar News
- Mahabubnagar News Live
- Mahabubnagar News Today
- Most Important News
- Telanagana News
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news
- telugu news online
- telugu news update
- Telugu News Updates
- TELUGU STATES NEWS
- Today News in Telugu
- trs government
- TS News Today Telugu
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement