తొర్రూర్ టౌన్, డిసెంబర్ 26(ప్రభన్యూస్) కేరళలో అయ్యప్ప స్వామి భక్తులకు పందులు కలగకుండా కేరళ రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కకోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో, పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భంగా తొర్రూర్ మీదుగా వెళుతూ పట్టణంలోని పంచముఖ నాగేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో మాట్లాడి తన వంతు అందజేస్తానని చెప్పారు. భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు. కేరళ లో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అక్కడికి వెళ్లి వచ్చినవారు ఎంతోమంది తెలియజేశారని, రానున్న మకర సంక్రాంతి పర్వదిన వరకు అయ్యప్ప భక్తుల ఎక్కువగా అవుతుందని అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. ఆలయ అర్చకులు గీతాచార్యులు యాదగిరి ఆచార్యులు వేణు రఘు మధుశర్మ ఆలయ కమిటీ సభ్యులు గోపురం నాగేశ్వరరావు, నాగేశ్వరావు ప్రసాద్, నాగేశ్వరరావు, నాగేంద్ర చారి, ఇమ్మడి రాంబాబు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.