Friday, November 22, 2024

తెలంగాణ: ప్రైవేటుకు ధీటుగా సర్కార్ బడులు

తెలంగాణలో విద్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం గిర్మాపూర్ గ్రామంలో నిర్మించిన ఎస్సి ఎస్టీ బాలుర పాలిటెక్నిక్ హాస్టల్ ను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి మంత్రి సబితా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రూ. 127 కోట్లతో 17  పాలిటెక్నిక్ భవనాలు నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 12 ప్రభుత్వ పాలిటెక్నిక్ కలశాలల ఏర్పాటు చేశామని, ఇందులో నాలుగు బాలికలకు, ఒకటి ఎస్ టి బాలురకు కేటాయించినట్లు వివరించారు. రాష్ట్రంలో ఉన్న 22 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సుమారు 2,200 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. 22 హాస్టళ్లలో ఒక్కొక్కటి 3 కోట్ల రూపాయలతో నిర్మించాలని 66 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. పదో తరగతి,ఇంటర్ తర్వాత బాలికలు విద్యా ఆపకుండా 33 మహిళ డిగ్రీ కలశాలలు ఏర్పాటు చేశామన్నారు. విదేశాల్లో చదివే వారికి ఓవర్సీస్ స్కాలర్ షిప్ ద్వారా అండగా ప్రభుత్వం ఉందని వివరించారు.  ప్రపంచంతో తెలంగాణ విద్యార్థులు పోటీ పడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కు 4 వేల కోట్లు మంజూరు చేశామన్నారు. ప్రయివేటుకు దీటుగా అత్యాధునికంగా మార్చటానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సబితా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement