దేశంలో ఎక్కలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో సంక్షేమ పథకం అమలు చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం సరూర్ నగర్,ఆర్ కె పురం డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సరూర్ నగర్, ఆర్ కె పురం డివిజన్లలో 1033 మంది లబ్ధిదారులకు 7 కోట్ల 38 లక్షల పై చిలుకు కల్యాణ లక్ష్మి,షాది ముబారక్ కింద అడబిడ్డల పెళ్ళిళ్ళకు ప్రభుత్వ సహాయం అందించామన్నారు. ఎవరి ప్రమేయం లేకుండా, పైరవి లేకుండా నేరుగా దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం సహాయం అందిస్తుందన్నారు. కరోనా వల్ల ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కూడా ఈ పథకానికి నిధులు ఆపలేదన్నారు. రెవిన్యూ శాఖ సిబ్బంది కళ్యాణ లక్ష్మి పథకానికి సంభందించి బాగా పని చేస్తున్నారని అభినందించారు. కేసీఆర్ కిట్ తో సహా మహిళల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి సబితా వివరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement