రంగారెడ్డి జిల్లాలోని కుల్కచర్ల మండలం, ముజాహిద్ పూర్ గ్రామ పరిధిలో విద్యార్థులు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం ఢీకొన్న సంఘటనలో గాయపడి, ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ఈ సంఘటనకు దారితీసిన కారణాలను మంత్రి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన విద్యార్థులకు ఉత్తమ వైద్యసేవలను అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. గాయపడిన విద్యార్థుల్లో ఐదుగురికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయని, ఒకరికి మాత్రం ఎక్కువ గాయాలయ్యాయని మంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్బంగా అక్కడే ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులను మంత్రి పరామర్శించి వారికి దైర్యం చెప్పారు. గాయపడిన విద్యార్థులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వమే చికిత్స అందిస్తుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి పరామర్శించిన వారిలో ఉన్నారు. గాయపడిన విద్యార్థులకు ఉత్తమ వైద్య సేవలు అందించే విధంగా పర్యవేక్షించాలని వికారాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిని మంత్రి ఆదేశించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
AndhraPrabha #AndhraPrabhaDigital