భద్రాచలం కొత్తగూడెం జిల్లాని భద్రాచలం ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం అర్ధరాత్రి జిల్లా కలెక్టర్ అనుదీప్ భార్య మాధవి పండంటి మగ శిశువుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. భద్రాద్రి కలెక్టర్ దంపతులను మంత్రి అభినందించారు. ప్రభుత్వ వైద్య సేవలపై సీఎం కేసీఆర్ కోరుకున్న మార్పు ఉమ్మడి ఖమ్మం జిల్లాతోనే మొదలు కావడం ఆనందంగా ఉందని మంత్రి పువ్వాడ అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న మెరుగైన వసతులతో ప్రభుత్వాసుపత్రులపై ఉన్న అపోహలు తొలగి, ప్రభుత్వ వైద్య సేవలు గొప్పవని విశ్వాసం పెరిగిందన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం సేవలో పొంది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, మాధవి దంపతులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. గత పాలకుల హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రుల అంటే దయనీయంగా ఉండి, చాలీ చాలని వసతులతో ప్రభుత్వ వైద్య సేవలు పొందేందుకు వచ్చే రోగులు అష్ట కష్టాలు పడేవారు. కానీ మన స్వరాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సి.ఆర్ గారు ప్రభుత్వ ఆసుపత్రులకు ఇస్తున్న ప్రాధాన్యత, ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్నా మెరుగైన వసతులు, వైద్య సేవలు కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ఉన్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆనందం వ్యక్తం చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొన్న సబ్ కలెక్టర్, నేడు భద్రాద్రి కలెక్టర్ లు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందారు అంటే తనకెంతో ఆనందంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కోరుకున్న మార్పు ఇదేనని మంత్రి పువ్వాడ చెప్పారు.
ఇది కూడా చదవండి: Bhadradri: ప్రభుత్వాస్పత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం!