Wednesday, January 15, 2025

Protest – ఆలయ అధికారులపై పొన్నం ఆగ్రహం – నేలపై కూర్చొని నిరసన

కొత్త కొండ – సంక్రాంతి సందర్భంగా మహా వైభవంగా జరిగే కొత్తకొండ వీరభద్ర స్వామి సన్నిధిలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. అధికారుల నిర్వాకం, వసతుల లోపంపై అసహనాన్ని వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ వసతిగృహం వద్ద నేలపై కూర్చొని నిరసన తెలిపారు.

.

రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో వీరభద్రస్వామి జాతర జరుగుతుంది.. సంక్రాంతి సందర్భంగా మహా వైభవంగా జరిగే ఈ జాతరకు వేలాది మంది భక్తులు వస్తుంటారు.. జాతర నిర్వహణకు నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లుచేశారు.. అధికారులు, పోలీసులు, పాలక వర్గానికి జాతర నిర్వహణపై అంతకుముందే మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

- Advertisement -

అయితే జాతర నిర్వహణలో పోలీసులు, అధికారులు, పాలక కమిటీ మధ్య ఏకాభిప్రాయం లోపించింది.. జాతర విధుల నిర్వహణ కోసం వచ్చిన కొందరు పోలీసు అధికారుల ప్రవర్తనపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.. అదే సమయంలో దేవాదాయ శాఖ అధికారులపై భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి..

ఈ క్రమంలోనే.. కొత్తకొండ వీరభద్రస్వామి దర్శనం కోసం వచ్చిన మంత్రి పొన్నం అధికారుల నిర్వాకంపై అసహనం వ్యక్తం చేశారు.. కనీసం గర్భ గుడిలోకి రాకుండా బయట నుంచే మొక్కుకుని వెళ్ళారు.. అందరికీ శీఘ్ర దర్శనం కలిగేలా చూడాలని అధికారులను ఆదేశంచారు..

అక్కడి వసతి గృహం వద్దకు వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడ నేలపై కూర్చొని అసహనం వ్యక్తం చేశారు.. మోకాళ్లపై నిలబడి మీడియా సమావేశం నిర్వహించారు.జాతర విధుల్లో ఉన్న కొందరు పోలీస్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మంత్రి దృష్టి కి తీసుకువచ్చారు..

మంత్రి నేలపై కూర్చొని తన అసహనాన్ని ప్రదర్శించడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పోలీసులు ఎంత బ్రతిమలాడినా ఆయన అక్కడి నుంచి లేవకుండా అక్కడే కూర్చుని ప్రెస్ మీట్ నిర్వహించారు

.

Advertisement

తాజా వార్తలు

Advertisement