పోలీస్ స్టేషన్లో నమోదయిన కేసు విషయంలో డబ్బులు డిమాండ్ చేసిన మంత్రి పీఏ మల్లికార్జున్ పై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ ఏసీపీ తుల శ్రీనివాస్ రావు తెలిపారు. గత నెల 17న కరీంనగర్ సిటీలోని వాటర్ ప్లాంట్ లపై పోలీసులు తనిఖీలు నిర్వహించి నిబంధనలను పాటించని వారిపై కేసు నమోదు చేశామన్నారు. ఇదే క్రమంలోలో సుభాష్ నగర్లోని ఓ వాటర్ ప్లాంట్ పై కేసు నమోదు చేయగా ఆ ప్లాంటు యజమాని మంత్రి పీఏ మల్లికార్జున్ ను సంప్రదించారు. దీంతో కేసు లేకుండా చేస్తానని అందుకు ఖర్చు అవుతుందని డబ్బులు డిమాండ్ చేయడం జరిగిందన్నారు.
పోలీసు అధికారులు అందరూ తనకు తెలుసని తాను మంత్రి వద్ద పీఏగా పని చేస్తున్నానని చెప్పుకుని, తనకు చాలా పలుకుబడి ఉందని సదరు యజమాని నమ్మించి డబ్బులు డిమాండ్ చేసినట్టు ఏసీపీ తెలిపారు. మంత్రి పీఏగా చెప్పుకుంటున్న మల్లికార్జున్‌పై వాటర్ ప్లాంట్ యజమాని శుక్రవారం మూడో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్టు ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు.