ప్రభ న్యూస్ ప్రతినిధి మేడ్చల్ : 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భా గంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకురా మల్లారెడ్డి మంగళవారం మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రధాన వేడుకలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వందన సమర్పణ చేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని, అందులో భాగంగా మేడ్చల్ జిల్లా కూడా అభివృద్ధి చెందినదని చెబుతూ, జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్య క్రమం లో జిల్లా కలెక్టర్ అమోయ కుమార్, అదనపు కలెక్టర్లు అభిషేక్, విజయేంద్ర రెడ్డి, మేడ్చల్ డి.సి.పి షబరీష్, జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, ఉద్యోగులకు మంత్రి మల్లారెడ్డి ప్రశంసా పత్రాలు ప్రధానం చేశారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఎంతగానో అలరించాయి.