తెలంగాణ రాష్ట్రం నుంచి త్వరలో మరో కోవిడ్ టీకా వస్తుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మరో కోవిడ్ టీకా వస్తుండడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాను విడుదల చేయగా, తాజాగా తెలంగాణకు చెందిన బయలాజికల్ ఈ కంపెనీ కార్బివాక్స్ అనే కోవిడ్ టీకాను త్వరలో విడుదల చేయనుంది. ఈసందర్భంగా బయలాజికల్ ఈ కంపెనీ సీఈవో మహిమ దాట్ల, ఆమె బృందానికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. 2022 ఫిబ్రవరి నుంచి నెలకు 100 మిలియన్ల డోసులను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా ఈ కంపెనీ నిర్ణయించుకుంది. ఈ కంపెనీ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా కార్బివ్యాక్స్ కు అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు ఇచ్చింది.
తెలంగాణ నుంచి మరో కోవిడ్ టీకా : హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement