Tuesday, November 26, 2024

63.25 లక్షల మంది రైతులకి రైతుబంధు నిధులు

ఖరీఫ్ సీజన్ సందర్భంగా 63.25 లక్షల మంది రైతులు రైతు బంధు ద్వారా లబ్ధి పొందుతారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రైతుల ఖాతాల్లో రూ.7,508 కోట్లను జమ చేస్తామని పేర్కొన్నారు. 150.18 లక్షల ఎకరాలకు సంబంధించిన రైతుబంధు సాయాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. రైతుల పెట్టుబడి సాయం కోసం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రైతు బంధు పథకం దేశంలోనే మొట్టమొదటి కార్యక్రమమని, ఆ తర్వాత మరిన్ని రాష్ట్రాలూ తెలంగాణను అనుసరిస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలోనూ రైతు బంధు పథకం నిరాటంకంగా కొనసాగుతోందని తెలిపారు. ఇది రైతు ప్రభుత్వమని, రైతుల రాష్ట్రమని పేర్కొన్నారు. రైతుబంధుతో బాసట, రైతుభీమాతో ఊరట, 24 గంటల ఉచిత కరెంటుతో ప్రోత్సాహం అందిస్తోందని మంత్రి కేటీఆర్ చెప్పారు.

ఇదీ చదవండి: టీఆర్ఎస్ లో చేరికపై ఎల్.రమణ క్లారిటీ

Advertisement

తాజా వార్తలు

Advertisement