రాజన్న సిరిసిల్లా జిల్లాలోని మానేరువాగులో ఆరుగురు బాలురు గల్లంతు కావడం పట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన పైన జిల్లా అధికారులతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. చనిపోయిన బాలుర కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నియోజకవర్గంలోని జలవనరుల సంపూర్ణంగా నిండి ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆయా ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వహించాలని కేటీఆర్ సూచించారు. ప్రాజెక్టుల వద్ద సాధ్యమైనన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ప్రభుత్వం తరఫున ఆయా కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు.
కాగా, మానేరు చెక్‌డ్యాం వద్ద గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గాలింపు చర్యల్లో సాయం చేసేందుకు హైదరాబాద్ నుంచి గజ ఈతగాళ్ల బృందాన్ని తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో డీఆర్‌ఎఫ్ అధికారులతో కూడా కేటీఆర్ మాట్లాడారు. గల్లంతైన వారిలో ఓ విద్యార్థి మృతదేహాన్ని గుర్తించారు. 8వ తరగతి చదువుతున్న గణేష్‌గా గుర్తించారు. మరో విద్యార్థి మృతదేహం లభించింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్లపల్లి శివారులోని మానేరు వాగులో ఐదుగురు విద్యార్థులు గల్లంతైన సంగతి తెలిసిందే. సోమవారం సరదాగా 8 మంది స్నేహితులు మానేరు వాగులో ఈతకు వెళ్లారు. ఒకరి వెంట ఒకరు ఐదుగురు అందులో దూకారు. లోతు ఎక్కువగా ఉండటంలో దూకిన విద్యార్థులంతా గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభ్యం కాగా, మిగతా నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సిరిసిల్ల పట్టణ శివారులోని రాజీవ్‌నగర్‌కు చెందిన ఈ విద్యార్థులంతా జిల్లా కేంద్రంలోని కుసుమ రాజయ్య జెడ్పీ హైస్కూల్‌లో చదువుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily