తైవాన్ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇన్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తైవాన్ – కనెక్ట్ తెలంగాణ స్టేట్ సమావేశంలో మంత్రి కేటీఆర్ వర్చువల్‌గా పాల్గొన్నారు. తెలంగాణ- తైవాన్ మధ్య అద్భుతమైన భాగస్వామ్యం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటిదాకా తెలంగాణ- తైవాన్ మధ్య అద్భుతమైన భాగస్వామ్యం ఉందని తెలిపారు. తైవాన్ పెట్టుబడుల కోసం గతంలో ఆ దేశంలో పర్యటించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
తైవాన్ దేశానికి సంబంధించిన టీసీఏ (taiwan computer association) తో టెక్నాలజీ పార్ట్‌నర్‌షిప్ అగ్రిమెంట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తవించారు. ఇండియన్- తైవాన్ స్టార్టప్ భాగస్వామ్యం ఏర్పాటు చేసిన ఏకైక భారత సిటీగా హైదరాబాద్ ఉందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో సుమారు 32 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించిందని కేటీఆర్ వివరించారు. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజాలను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: బీ అలర్ట్ ‘షహీన్’ తుఫాన్ వచ్చేస్తోంది….