Sunday, November 24, 2024

తెలంగాణలో క్షీరవిప్లవం: మంత్రి కేటీఆర్

తెలంగాణలో హరిత విప్లవంతో పాటు క్షీరవిప్లవం మొదలైందని మంత్రి కేటీఆర్ అన్నారు. మదర్ డెయిరీని లాభాల బాటలో నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఇప్పటికే విజయ డెయిరీని రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేవలం వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాల్లో ఉన్న అవకాశాలను సైతం అందిపుచ్చుకునేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణా ఏర్పడిన రోజు నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. 

ఇది కూడా చదవండి: హుజురాబాద్ బైపోల్: స్వరం పెంచిన ఈటల..

Advertisement

తాజా వార్తలు

Advertisement