Saturday, November 23, 2024

స్వచ్ఛ సాగరమే లక్ష్యం.. మురుగునీటి శుద్ధి ప్లాంట్ తో సాధ్యం

హైదరాబాద్‌కు జనాభాకు తగ్గట్లుగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ఫతేనగర్‌లో మురుగునీటి శుద్ధి ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ. 317 కోట్ల వ్యయంతో 100 ఎంఎల్​డీ సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పట్టణీకరణకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్‌లో రోజుకు 1,950 ఎంఎల్‌డీల మురుగునీటి ఉత్పత్తి అవుతున్నట్లు తెలిపారు. సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా మురుగునీటి శుద్ధి అవుతుందని స్పష్టం చేశారు. గతంలో మంచినీరు, మురుగునీరు పైప్‌లైన్లు కలిసిపోయాయని గుర్తు చేశారు. మంచినీటిలో మురుగునీరు కలవడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇప్పటికే దాదాపు 40 శాతం మురుగునీటిని శుద్ధి చేస్తున్నట్లు వివరించారు. తేనగర్‌లో రూ.1280 కోట్ల వ్యయంతో 17 ఎస్‌టీపీలు నిర్మించబోతున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement