హైదరాబాద్ నగర వాసులకు మరో ఫ్లైఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. నగరంలో అత్యంత ట్రాఫిక్ సమస్య కలిగిన ప్రాంతాల్లో ఒకటైన బాలానగర్ లో నిర్మించిన కొత్త బ్రిడ్జిని మంత్రులు తలసాని, మల్లారెడ్డిలతో కలిసి కేటీఆర్ బ్రిడ్జిని ప్రారంభించారు. మొత్తం 1.13 కి.మీ పొడవున్న ఈ ఫ్లై ఓవర్ ను 24 మీటర్ల వెడల్పు, 26 పిల్లర్లతో నిర్మించారు. ఆరు లేన్లతో నగరంలో నిర్మించిన తొలి ఫ్లై ఓవర్ ఇదే కావడం విశేషం. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే బాలానగర్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తప్పనున్నాయి. రూ.385 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ బ్రిడ్జి నిర్మాణం పనులు మూడున్నర ఏళ్ల వ్యవధిలో పూర్తి అయింది.
ఇది కూడా చదవండి: ఏపీలో థియేటర్లు ఓపెన్.. తెలంగాణ సంగతేంటి?