రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ మహబూబాబాద్‌లో పర్యటిస్తున్నారు. మానుకోటలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రూ.50 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం రూ.5 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్, ఫ్రూట్స్, ఫ్లవర్ మార్కెట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్యా నాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు పాల్గొన్నారు.
Mahabubabad : ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement