తెలంగాణ పచ్చదనం పెంపు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టారని మంత్రి కేటీఆర్ అన్నారు. అటవీశాఖ జాతీయ వర్క్ షాప్‌ను మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఆధునిక, సాంకేతిక పద్ధతుల్లో అటవీశాఖ నిర్వహణ, కంపా నిధులు సద్వినియోగం, అటవీ పునరుద్ధరణ పనులపై జాతీయ వర్క్ షాప్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో పచ్చదనం 24 శాతం నుంచి 31 శాతానికి పెరిగిందని తెలిపారు. పరిశ్రమలు, పట్టణాభివృద్ధితో పాటు పచ్చదనం అత్యంత ప్రాధాన్యమైనవని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సరళతర వాణిజ్య విధానం తరహాలో గ్రీన్ ర్యాంకింగ్స్ తీసుకొచ్చి రాష్ట్రాల మధ్య పోటీ పెంచాలని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement