రాష్ట్రంలోని వరంగల్‌లో టెక్ సెంటర్ ఏర్పాటు కోసం జెన్ ప్యాక్ట్ ముందుకొచ్చింది. జెన్‌ప్యాక్ట్ రాకతో వరంగల్ అత్యున్నత స్థాయికి ఎదగనుందని కేటీఆర్ పేర్కొన్నారు. జెన్‌ప్యాక్ట్ ప్రకటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. జెన్‌ప్యాక్ట్ రాకతో వరంగల్ ఐటీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టైర్ 2 పట్టణాల్లో ఐటీ అభివృద్ధికి సహకరిస్తున్న సంస్థలకు మద్దతు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా జెన్‌ప్యాక్ట్ సీఈవో త్యాగరాజన్, వారి బృందానికి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital