Tuesday, November 19, 2024

ధర్మపురిలో ఇథనాల్‌ పరిశ్రమ..

ధర్మపురి నియోజకవర్గంలో ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. స్తంభంపల్లిలోని చిన్నపాటిగుట్ట బోళ్ల వద్ద పరిశ్రమను నెలకొల్పేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. పరిశ్రమ ఏర్పాటుకు అనుగుణంగా వెంటనే ఆ ప్రాంతాన్ని చదును చేయించాలని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయల సంస్థ (టీఎస్‌ఐఐసీ) ఎండీ వెంకట నర్సింహారెడ్డిని మంత్రి ఆదేశించచారు. పరిశ్రమ స్థాపనపనై మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌, పెద్దపెల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత, పోలీస్‌ హౌసింగ్‌ సొసైటీ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ గుప్తా, క్రిబ్‌కో తెలంగాణ ఇంఛార్జి రాంరెడ్డితో కేటీఆర్‌ మంగళవారం చర్చిం చారు.

భూ సేకరణకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే వెంటనే పరిష్క రించాలని కేటీఆర్‌ అధికారులకు ఆదేశాలిచ్చారు.
ఈ సందర్భంగా కేటీఆర్‌కు మంత్రి కొప్పుల ధన్యవాదాలు తెలిపారు. మారుమూల ధర్మపురి నియోజక వర్గంలో ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటు కోసం రైతాంగం, స్థానిక ప్రజలంతా ఎదురు చూస్తుండగా పరిశ్రమ స్థాపనకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement