టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ థర్డ్ రేట్ క్రిమినల్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను రేవంత్ గాడిదతో పోల్చారని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి.. సొంత పార్టీ నాయకుడినే గాడిద అన్నారని విమర్శించారు.ఈ మేరకు ఓ న్యూస్ క్లిప్‌ను కేటీఆర్ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. థర్డ్ రేట్ క్రిమినల్‌కు పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తే ఇలానే ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇటీవల ఐటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తన బృందంతో హైదరాబాద్‌లో పర్యటించి, ఐటీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. ఐటీ అభివృద్ధికి కృషి చేస్తున్న కేటీఆర్‌ను కూడా శశిథరూర్ కొనియాడారు.
అయితే శశిథరూర్ పర్యటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సమాచారం లేదు. దీంతో ఆయనపై రేవంత్ మండిపడినట్టు ఓ జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. శశిథరూర్ ఓ గాడిద అని, ఆయనను పార్టీ త్వరలోనే బహిష్కరిస్తుందని రేవంత్ రెడ్డి అన్నట్లు పేర్కొంది. దీనిని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.