Thursday, November 21, 2024

ఆస్పత్రి నుంచి కేటీఆర్ డిశ్చార్జ్.. కరోనా తగ్గిందా?!

కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌ బుధవారం రాత్రి డిశ్చార్జ్‌ అయ్యారు. ఏప్రిల్‌ 23న ఆయనకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ కాగా వైద్యుల సలహా మేరకు ఏప్రిల్‌ 30న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో వైద్యులు ఆయనను డిశ్చార్జ్‌ చేశారు.

గత నెల 23న కేటీఆర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. అప్పట్నుంచి డాక్టర్ల సలహా మేరకు హోం ఐసోలేషన్‌ లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఆ తర్వాత డాక్టర్ల సలహా మేరకు ఆయన హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చేరారు. అయితే ఆస్పత్రిలో చేరిన అనంతరం దగ్గు తక్కువ కావడంతో అక్కడ్నుంచి కేటీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం మళ్లీ హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఆస్పత్రిలో కేటీఆర్‌ కు కరోనాకు సంబంధించి డాక్టర్లు ఎలాంటి టేస్టులు చేయలేదని తెలుస్తోంది. దీంతో ఆయన మరికొన్ని రోజుల పాటు హోం ఐసోలేషన్‌ లోనే ఉండనున్నారు.

అలాగే, టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డారు. బుధవారం వైద్యులు ఆయనకు చేసిన కరోనా పరీక్షల్లో ఫలితం నెగెటివ్‌ గా వచ్చింది. దీంతో ఆయన బుధవారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం హోం ఐసొలేషన్‌ లో ఉన్నారు.

కాగా, సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయనకు చేసిన టెస్టుల్లో కరోనా నెగెటివ్ అని తేలింది. ఆయన వ్యక్తిగత వైద్యులు సైతం సీఎం కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement