తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచనలో పుట్టిన కళ్యాణ లక్ష్మీ పథకం పేదలకు వరం అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ పథకం దేశానికి ఆదర్శం అని చెప్పారు. శనివారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజ్ పల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 4 కోట్ల 16 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం 19 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో పుట్టిందన్నారు. నిరు పేద ఆడపడుచులకు పెద్దన్నయ్యల అండగా ఉంటున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. కళ్యాణ లక్ష్మి పథకంతో పెదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00116 వేలు ఆర్దిక సహాయం అందిస్తుందని గుర్తు చేశారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఉపయోగించుకుని మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని మంత్రి కొప్పుల సూచించారు.