ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తనకు ఉన్న గొప్ప మనసు చాటుకున్నారు. చెప్పులు లేకుండా ఓ చిన్నారి కాలినడకను వెళుతుంటే చలించిపోయారు. దగ్గరలో ఉన్న ఓ చెప్పులు దుకాణానికి ఆ చిన్నారిని తీసుకు వెళ్లి చెప్పులు కొని ఇచ్చారు.. అలాగే ఆ చిన్నారికి డ్రస్ కూడా కొనుగోలు చేసి అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరూ మంత్రి కొండా సురేఖ ఔదార్యంపై ప్రశంసించారు.
ఇలా ఔదార్యం చాటుకున్న సురేఖ
వరంగల్ నుంచి పెద్దపల్లి వైపు మంత్రి కొండా సురేఖ వెళుతున్నారు. ఈ క్రమంలో సుల్తానాబాద్ మార్కెట్ చౌరస్తావద్ద రోడ్డుపై చెప్పులు లేకుండా వెళ్తున్న ఒక బిహార్ పాపను చూశారు. వెంటనే తన కాన్వాయ్‌ని ఆపించి ఆ పాప వివరాలు తెలుసుకున్నారు. వెంటనే పక్కనే ఉన్న ఓ దుకాణానికి ఆ పాపను తీసుకు వెళ్లి చెప్పులు కొని ఇచ్చారు. అలాగే ఆ పసి పాపకు బట్టలు కూడా కొని ఇచ్చారు