హైదరాబాద్ – మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విరుచుకుపడ్డారు… ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేని అసమర్థ నాయకుడు.. ముగ్గురుని హత్య చేసిన కేసులో నిందితుడు, హంతకుడు అంటూ పరుషపదజాలంతో ఆరోపణలు గుప్పించారు.. హైదరాబాద్ లో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ… రేపో మాపో జగదీశ్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం అంటూ హెచ్చరించారు.. అతడి గురించి మాట్లాడటం వెస్ట్ అని మంత్రి పేర్కొన్నారు. ఏ ఆస్తిలేని మాజీ మంత్రి 80ఎకరాల ఫామ్ హౌస్ ఎలా కట్టారంటూ అని ప్రశ్నించారు. అలాగే, జగదీశ్వర్ రెడ్డికి సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం చుట్టూ 150ఎకరాల భూములు ఎలా వచ్చాయిని నిలదీశారు..
100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తాం…
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100రోజుల్లో అమలు చేసి తీరుతామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఇక 200 యూనిట్ల కరెంట్..100 రోజుల్లో ఇచ్చి.. హామీ నిలబెట్టుకుంటామన్నారు. తెలంగాణ ఉద్యమంలో దళితుణ్ణి సీఎం చేస్తా అని చెప్పిన కేసీఆర్ ఏం చేశారని, అంటూ దళితుణ్ణి సీఎం చేయకపోతే మెడ మీద తల నరుక్కుంటానని అన్న ఆయన 9ఏండ్లు తల నరుక్కున్నారా..? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ దోపిడీతో.. తాము ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయలేకపోయామన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తా అన్న కేసీఆర్ ఇవ్వలేదని గుర్తు చేశారు.. నిరుద్యోగులను బీఆర్ఎస్ మోసం చేసిందని, పదేళ్లు వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఫైర్ అయ్యారు.