కంటి చూపుతో ఇబ్బంది పడుతున్నవారికి ఉచితంగా క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయనున్న శంకర నేత్రాలయం సేవలను అందరూ వినియోగించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజలను కోరారు.. యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి అడిటోరియంలో కంటి వైద్య శిబిరాన్ని సోమవారం నాడు ఆయన ప్రారంభించారు.. ఈ సందర్బంగా మాట్లాడుతూ, శంకర్ నేత్రాలయం గొప్ప కార్యక్రమం చేస్తుందని ప్రశంసించారు.
తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్య శ్రీని రూ.10 లక్షలకు పెంచామని చెప్పారు. గతంలో పేదలకు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చిందని తెలిపారు. వారం రోజుల పాటు ఉచితంగా క్యాటరాక్ట్ ఆపరేషన్ చేస్తున్నారని శంకర నేత్రాలయం హాస్పటల్స్ లో చేస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో సమయం సరిపోక, ఆపరేషన్ ఇక్కడ జరగకపోతే తన సొంత ఖర్చులతోనైనా పంపిస్తానని మంత్రి చెప్పారు.
ఇక సంపాదించింది అందరికీపంచాలన్నారు. అమెరికాలో చాలా మంది దానం చేస్తారని అయితే మన దేశంలో దానం చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారన్నారు. అందుకే.. సంపాదించినది పంచమని అందరికీ చెబుతానన్నారు. కొంచెం బిజీగా ఉండడం వల్లే సినిమా వాళ్లను కలవడం కుదరడం లేదని..త్వరలో సినిమా కార్మికుల కష్టాలను కూడా తెలుసుకుంటానని చెప్పారు. 3 ఎకరాల స్థలంలో కార్మికులకు ఇళ్లు కట్టిస్తామని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.