కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదని రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘2014 ముందు కేసీఆర్ లేడు.. తెలంగాణ రాష్ట్రం లేదు. 2014 తరువాత కేసీఆర్ వచ్చాడు.. ఇంత అభివృద్ధి జరిగింది..’ అని అన్నారు. 2014 తర్వాత తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలన్నారు. బీజేపీ నేతలు ప్రెస్ మీట్‌లో చెప్పిందే చెప్తారు తప్ప… కొత్తగా చేసిందేమీ లేదన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు భాష గురించి మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని ఎద్దేవా చేశారు.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, అలాగే రాష్ట్రం నుంచి ఉన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు సీఎం కేసీఆర్ ఇక్కడ ప్రవేశపెట్టారన్నారు. తెలంగాణలో వరి ధాన్యం దిగుబడి పెరిగిందన్నారు. మాటలు కాదు చేతలు కావాలని కామెంట్ చేశారు. కేంద్రం ఎన్ని టన్నుల ధాన్యం కొంటుందో చెప్పకుండా… కిషన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రులు మాట్లాడాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వాలకు పంచవర్ష ప్రణాళికలు, వార్షిక ప్రణాళికలు ఉంటాయని, మరి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ప్రణాళికలు లేవని అన్నారు. చిల్లర గాళ్లు కాదు.. రాష్ట్ర రైతాంగానికి, సీఎం కేసీఆర్‌కు సమాధానం చెప్పాల్సింది.. కేంద్ర మంత్రులు, ప్రధాని నరేంద్ర మోదీ చెప్పాలన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital