ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పట్టణప్రగతి కార్యక్రామాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాల మున్సిపల్ చైర్మన్ లకు పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిలపై ప్రత్యేక కార్యాచరణ పధకాలను రూపొందించినప్పటికి ఆశించిన ఫలితాలు రావడం లేదన్నారు. కార్యక్రమంలో ఎదురౌతున్న లోటుపాట్లను సరిదిద్దుకుని విజయవంతంగా నిర్వహించాలని ఆయన సూచించారు. తద్వారా మీరు కోరుకున్న రీతిలో అభివృద్ధి సాధ్యపదుతుందని చెప్పారు.
జులై 1 నుండి 10 వరకు నిర్వహించనున్న పట్టణ ప్రగతిపై మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ నుండి సూర్యాపేట, నల్లగొండ,యాదాద్రి జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ చైర్మన్లు,కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పట్టణప్రగతి పై సత్ఫాలితాలు సాదించేందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు పాటించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో సమీకృత వెజ్ & నాన్ వెజ్ కూరగాయల మార్కెట్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన చెప్పారు. వైకుంటదామల నిర్మాణాలలో ఎంతమాత్రం అలసత్వం చూపరాదన్నారు. మున్సిపాలిటీ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. భూముల రికార్డుల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలన్నారు. పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటులో మున్సిపాలిటీలు ముందుండలన్నారు. ఇండ్ల మీదుగా వెడుతున్న విద్యుత్ తీగల తొలగింపుపై నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులతో అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. అంతే గాకుండా పట్టణ ప్రగతిలో ప్రధానంగా విశ్రాంత ఉద్యోగులను భాగస్వామ్యం చెయ్యాలని అలాగే పట్టణ ప్రగతిలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తనిఖీలు చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు.
ఇది కూడా చదవండి: ఏపీ సీఎం జగన్‌కు చంద్రబాబు సలహా!