Tuesday, November 19, 2024

రాజ్‌భవన్ లోకి రాజకీయాలు ఎందుకు?: గవర్నర్ వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్

ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై గవర్నర్ ఫిర్యాదుపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి స్పందించారు. గవర్నర్ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. రాజ్యాంగ పదవుల పట్ల తమ ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందని, ప్రోటోకాల్ విషయంలో లోపాలపై ఎప్పుడు స్పందించని గవర్నర్.. ఇప్పుడెందుకు స్పందిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ పదవిలో వస్తే ఎలాంటి అభ్యంతరం లేదని, గవర్నర్ పదవి అడ్డంపెట్టుకుని పార్టీ నాయకురాలిగా వస్తే మాత్రమే సమస్య వస్తుందన్నారు. రాజ్యాంగబద్ధంగానే బడ్జెట్ సమావేశాలు జరిపామని చెప్పారు. ప్రభుత్వంగా తమ వైపు నుండి గవర్నర్ కి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, గత గవర్నర్ నరసింహన్ ఉన్నప్పుడి రాని సమస్య ఇప్పుడెందుకు వస్తుందో పరిశీలించుకోవలన్నారు. గవర్నర్ నియామకానికి ఎలాంటి నిబంధనలు ఉన్నాయో కౌశిక్ నియామకం అదే కోణంలో చూడాల్సిందన్నారు. కౌశిక్ రెడ్డి విషయంలో ప్రభుత్వ సిఫార్సులను ఆమోదించాల్సి ఉందని గుర్తు చేశారు.

కాగా, ప్రధాని మోదీతో భేటీ అనంతరం గవర్నర్ తమిళసై తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను వ్యక్తిగతంగా అవమానించినా, రాజ్యాంగపరంగా గవర్నర్ పదవికి తెలంగాణ ప్రభత్వం మర్యాద ఇవ్వాలని అన్నారు. మహిళా గవర్నర్ ను కాబట్టి అవమానిస్తున్నారని, గవర్నర్ కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement