Friday, November 22, 2024

హైదరాబాద్ లో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్: మంత్రి జగదీశ్

హైదరాబాద్ నగరం నలువైపులా విద్యుత్ వ్యవస్థ ను అభివృద్ధి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాయదుర్గంలోని 400 కేవీ గ్యాస్ ఇన్సూలేటెడ్ సబ్ స్టేషన్ ను సందర్శించి పనులను మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్ కో జెన్కో సిఎండి ప్రభాకర్ రావు ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాయదుర్గంలోని 400 కేవీ సబ్ స్టేషన్ భారత దేశంలోనే మొట్టమొదటి గ్యాస్ ఇన్సులేటెడ్  సబ్ స్టేషన్ అని తెలిపారు. హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని, దానికి అనుగుణంగా నగరం నలువైపులా విద్యుత్ వ్యవస్థ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

హైదరాబాద్ నగరంలో రాబోయే 30,40 సంవత్సరాల అవరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ వ్యవస్థ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరానికి విద్యుత్ వలయం ఏర్పాటు చేశామని, దీనితో ఒక్క క్షణం కూడా కరెంట్ పొదన్నారు. రింగ్ రోడ్ చుట్టూ 400 కెవి సబ్ స్టేషన్ లు,220 కెవి,133 కెవి,33 కెవి సబ్ స్టేషన్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. నాలుగు ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయుడం దీని ప్రత్యేకత అని తెలిపారు. ఈ నాలుగు సబ్ స్టేషన్ లను ఏర్పాటు చేయడానికి 100 ఎకరాల స్థలం అవసరం ఉండగా.. కేవలం 5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ కు 3 కిలో మీటర్లు కేబుల్స్ అండర్ గ్రౌండ్ నుండి ఏర్పాటు చేసినట్లు వివరించారు. దేశంలో మొదటి సారి మోనో పోల్స్ కూడా తెలంగాణ వాడుతోందన్నారు. టీఎస్ ట్రాన్స్ కో ఆధ్వర్యంలో నిర్మాణం చేయడం జరిగిందన్నారు. పనులు చాలా వేగంగా జరిగాయన్న మంత్రి.. కోవిడ్ తోపాటు అనేక ఆటంకాలు తట్టుకొని పూర్తి చేశామని చెప్పారు. ఈ సబ్ స్టేషన్ తో నగరానికి మరో 2000 మెగా వాట్స్ విద్యుత్ సరఫరా చేయవచ్చు అని తెలిపారు. ఈ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ ను 1400 కోట్లతో నిర్మించినట్లు చెప్పారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ప్రారంభిస్తారని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement