హైదరాబాద్ లో ఈ నెల 25, 26న జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నిర్వహణపై మంత్రులు మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. బోనాల నిర్వహణ, ఏర్పాట్లతో పాటు బోనాలు సమర్పించేందుకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందుగానే క్యూలైన్లపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. భద్రత పరంగా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేయడమే గాకుండా ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా వ్యాప్తి జరుగకుండా భక్తులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బోనాల ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని, దేవాలయాల వద్ద లైటింగ్ వంటి సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయానికి వచ్చే దారులన్నీ సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పారు.
ఇది కూడా చదవండి: కలెక్టర్ కార్యాలయంలో మహిళ ఆత్మహత్యాయత్నం