ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినొత్సవం సందర్భంగా రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా రైతులకు నీటిని మంత్రి తన్నీరు హరీష్ రావు విడుదల చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ.. కేసీఆర్ కారణజన్ముడని, ప్రజల ఆకాంక్షలను సీఎం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు తెలంగాణ గుక్కెడు తాగునీటి కోసం కష్టాలు పడిందని గుర్తు చేశారు. నేడు సాగునీరు ఇస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకున్నా, ప్రాజెక్ట్‌లకు అడ్డుపడుతున్నా తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement