Friday, November 22, 2024

రూ.10 వేల కోట్లతో ఆరోగ్యశాఖ అభివృద్ధి: మంత్రి హరీశ్ రావు

ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు మరింత విశ్వాసం పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి శనివారం మంత్రి హరీశ్ రావు నీలోఫర్ ఆసుపత్రిని సందర్శించారు. నీలోఫర్ ఆస్పత్రిలో అప్ గ్రేడ్ చేసిన వంద పడకల ఐసీయీ వార్డును మంత్రి  హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిలోఫర్ లో మరో 25 ఐసియు పడకలను 1.75 కోట్లతో ఏర్పాటు చేసేందుకు ఇన్ఫోసిస్, నిర్మాన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయల కల్పనకు కృషి చేస్తున్నామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి పడకకు ఆక్సిజన్ సదుపాయం కల్పిస్తున్నదన్నారు. సొంతంగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ వైద్య రంగాన్ని మరింత పటిష్టం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో 10 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు వెల్లడించారు. కరోనా థర్డ్ వేవ్ అంచనాల నేపథ్యంలో ప్రత్యేకంగా చిన్నారుల కోసం 5 వేల పడకలు ఏర్పాటు చేశామన్నారు. దీని కోసం సీఎం రు. 133 కోట్లు విడుదల చేశారని చెప్పారు.

హైసియా , నిర్మాన్ సంయుక్తంగా సెకండ్ వేవ్ తరువాత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతనికి 18 కోట్లు నిధులు అందించారని అన్నారు. 1.10 కోట్ల తో ఓపెన్ టెక్ట్స్ నుంచి నిలోఫర్ లో ఐసియు అప్ గ్రేడ్ చేయడం గొప్ప విషయమన్నారు. ఆరోగ్య శాఖను  మరింత వృద్ధి చేసి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తాన్న మంత్రి హరీశ్.. ప్రభుత్వ వైద్యం మీద ప్రజలకు మరింత విశ్వాసం పెంచాలన్నారు. కేసీఆర్ కిట్ వచ్చాక గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం ఉన్న డెలివరీ రేట్ ని 50 శాతానికి పెంచామన్నారు. IMR, MMR, NMR మరణాలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి మరో 8 మెడికల్ కాలేజీలను అందుబాటిలోకి రానున్నాయని చెప్పారు. ప్రతి జిలాల్లో ఒక మెడికల్ కాలేజి ఉండాలని సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. రు. 33 కోట్లతో నీలొఫర్ లో మరో 800 పడకలు త్వరలో అందుబాటులోకి తెస్తామని వివరించారు.

కాగా, కార్యక్రమంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, డిఎంఈ రమేష్ రెడ్డి, నిలోఫర్ సూపరింటెండెంట్ మురళి కృష్ణ, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, హైసియా ఎండి భరణి, నిర్మాన్, ఇన్ఫోసిస్, ఓపెన్ టెక్స్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement