Wednesday, November 20, 2024

స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ ర్యాలీలో పాల్గొన్న మంత్రి హ‌రీశ్ రావు-వృద్ధి రేటులో దేశంలోనే నంబ‌ర్ వ‌న్ గా తెలంగాణ‌

ఏడేళ్ల‌లో తెలంగాణ‌లో మూడింత‌ల వృద్ధి రేటు వ‌చ్చింద‌న్నారు మంత్రి హ‌రీశ్ రావు. సంగారెడ్డిలో స్వ‌తంత్ర‌భార‌త వ‌జ్రోత్స‌వ ర్యాలీ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి హ‌రీశ్ రావు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జెండా..రంగుల బెలూన్లు ఎగుర‌వేశారు. సీఎం కేసీఆర్ వ‌ల్లే తెలంగాణ‌లో ఇంత అభివృద్ధి జ‌రుగుతోంద‌ని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తుంద‌న్నారు. 11.5 వృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణ నంబ‌ర్ వ‌న్‌గా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తలసరి ఆదాయం రూ. 1 లక్ష 24 వేలు ఉండగా, ప్రస్తుతం రూ. 2 లక్షల 78 వేలతో అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు. నాడు రాష్ట్ర బ‌డ్జెట్ రూ. 62 వేల కోట్లు కాగా, ప్ర‌స్తుతం రూ. 1 ల‌క్ష‌ల 84 వేల కోట్ల బ‌డ్జెట్ ఉంద‌న్నారు. స్వతంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా సంగారెడ్డి ప‌ట్ట‌ణంలో 750 మీట‌ర్ల భారీ జాతీయ ప‌తాక ప్ర‌ద‌ర్శ‌న ర్యాలీ నిర్వ‌హించారు. ఈ ర్యాలీలో మంత్రి హ‌రీశ్‌రావు, ఎంపీలు కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి, బీబీ పాటిల్, క‌లెక్ట‌ర్ శ‌ర‌త్, జ‌డ్పీ చైర్మ‌న్ మంజు శ్రీ రెడ్డి, ఎమ్మెల్యే మానిక్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో పాటు విద్యార్థులు, ప్ర‌జ‌లు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement