Saturday, November 16, 2024

కేంద్రం తప్పులు చేస్తూ రాష్ట్రాలను బద్నాం చేస్తుంది

వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరిస్తోందని మంత్రి హరీష్‌ రావు అన్నారు. శనివారం సిద్ధిపేట పట్టణంలోని బాలాజీ గార్డెన్‌లో కోవిడ్ టీకా కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంపై మండిపడ్డారు. వ్యాక్సినేషన్‌ల విషయంలో కేంద్రం తీరు అమ్మ పెట్టదు, అడుక్కొనివ్వదు అన్న రీతిలో ఉందని అన్నారు. రాష్ట్రాలకు అవసరమైన వాక్సిన్లను కేంద్రం ఉచితంగా సరఫరా చేయడం లేదని ఆరోపించారు. కంపెనీలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొనివ్వడం లేదని మండిపడ్డారు. కేంద్రం తప్పుల మీద తప్పులు చేస్తూ రాష్ట్రాలను బద్నాం చేస్తుందని మండిపడ్డారు.

వ్యాక్సినేషన్ సకాలంలో పంపిణీలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. వ్యాక్సిన్ పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలపై పునసమీక్షించుకోవాలని హరీష్‌ రావు హితవు పలికారు. వ్యాక్సినేషన్ దిగుమతిని సరళతరం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలే ప్రాధాన్యత క్రమాలను నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించాలని మంత్రి డిమాండ్ చేశారు. కోవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల కొనుగోలుకు ఇప్పటికే ఆయా కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చిందని హరీష్ రావు తెలిపారు.

ఇది కూడా చదవండి : షర్మిల పార్టీ అధికార ప్రతినిధులు వీరే!

Advertisement

తాజా వార్తలు

Advertisement