సంగారెడ్డి జిల్లాలోని నారాయణ ఖేడ్ ప్రభుత్వాస్పత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆకస్మింగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. రక్త నిధి, ఆక్సిజన్ ప్లాంట్, ఎక్స్ రే విభాగాలను మంత్రి పరిశీలించారు. వైద్యుల సమయపాలన పై హాజరు పట్టిక, రికార్డ్ లను పరిశీలించారు. అయితే, ఆస్పత్రిలో పలువురు సిబ్బంది గైర్హాజరు కావడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బందిని మండలించారు. అంతేకాదు మళ్లీ ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్ర హరీశ్ రావు ఆదేశించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement