ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతిపై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్ర హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు రోశయ్యకు దగ్గరి అనుబంధం ఉందన్నారు. దేశ చరిత్రలోనే 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. ప్రతిపక్షాలను సైతం ఒప్పించి, మెప్పించగల నేత రోశయ్య అని కొనియాడారు. గవర్నర్ గా, సీఎంగా విశేష సేవలు అందించిన నాయకుడు రోశయ్య అని చెప్పారు. తాను మొదట అసెంబ్లీలో మాటాడినపుడు తనను ప్రోత్సహించిన వ్యక్తి రోశయ్య అని గుర్తు చేసుకున్నారు. ఆయన హయాంలోనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ జరిగిందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. తెలుగురాష్ట్రాల్లో వారి మరణం దిగ్బ్రాంతికి గురి చేసిందన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని, వివాద రహితుడిగా పేరొందిన నేత రోశయ్య అని మంత్రి హరీశ్ రావు కొనియాడారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement