నాగిరెడ్డిపేట్..ప్రభాన్యూస్…కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని లింగంపల్లి కలాన్ గ్రామంలో రాష్ట్ర ఆర్థిక,వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు.. పోచారం ప్రధాన కాల్వపై 50 లక్షల,,90 వేల,,నిధులతో నూతన బ్రిడ్జి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు.అంతకుముందు పోచారం గ్రామంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మంత్రి హరీష్ రావుకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికి శాలువతో ఘనంగా సన్మానించారు.అనంతరం మంత్రి గ్రామస్తులతో మరొకసారి ప్రభుత్వాన్ని గెలిపించాలని అడుగగా గ్రామస్తులందరూ వడ్లు రాలిపోయాయని మంత్రికి తెలుపగా ఎకరానికి 10,000 రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు.స్థానిక ఎంపీపీ దివిటీ రాజదాస్ పోడుభూముల గురించి మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ.పాటిల్,జిల్లా పరిషత్ చైర్మన్ దఫెదర్ శోభరాజు,కలెక్టర్ జితేష్ వి.పాటిల్,స్థానిక ఎంపీపీ దివిటి రాజదాస్,జడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్‌రెడ్డి,గ్రామ సర్పంచ్ కుమార్,బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య,ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ ప్రతాపరెడ్డి,మండల నాయకులు,నియోజకవర్గ నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement