మెదక్ జిల్లాలో రాష్ట్ర ఆర్ధిక ,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటించారు. మేళతాలలు, సన్నాయి, మంగళ హారతులతో మంత్రి హరీష్ రావు ,ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి లకు స్వాగతం పలికారు లబ్ధిదారులు.. డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి నివాళ్ళు అర్పించారు మంత్రి హరీష్ రావు. డబుల్ బెడ్రూం ఇళ్లలోకి వెళ్లిన మంత్రి హరీష్ రావు ను,ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి లను సన్మానించిన లబ్ధిదారులు..రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ఆటపాటలతో సందడి చేసిన కళాకారులు.. డబుల్ బెడ్రూం ఇల్లు పొందిన లబ్ది దారులకు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు ,ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ,ఎమ్మెల్సీ ఏగ్గే మల్లేశం జిల్లా కలెక్టర్ రాజర్షి షా జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం ఇల్లు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు,ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి .డాక్టర్ బాబు జగజీవం రాం జయంతి రోజు ఇళ్లలోకి వెళ్లడం అభినందనీయమన్నారు. సీఎం కేసీఆర్ దళిత వర్గాల కోసం దళిత బంధు,ఎస్సిఎస్టీ సబ్ ప్లాన్ పథకాలు ప్రవేశవపెట్టామన్నారు.
రూ. 20 కోట్లతో రమాయమోయటలో డబుల్ బెడ్రూం ఇల్లు తీసుకుంటున్నాం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ 60 వేలు ఇస్తే 40 వేలు అప్పు కింద ఇచ్చేది. రూపాయి ఖర్చు లేకుండా రూ 15 లక్షల విలువగల ఇళ్లు ఇస్తున్నాం .
పద్మమ్మ ను నిండు మనసుతో ఆశీర్వదించాలి. డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద అంగన్ వాడి,రేషన్ షాపు ఇవ్వమని కలెక్టర్ కు చెప్పానన్నారు. ఈ నెలలో మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తాం అన్నారు. రామయంపేట అభివృద్ధి కోసం వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తాం. కల్యాణ లక్ష్మీ,గృహ లక్ష్మీ తదితర పథకాలు మహిళలకోసం ప్రవేశపెట్టాం. ఇంటింటికి నీళ్లు ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం అన్నారు. పైసా ఖర్చు లేకుండా కాన్పులు చేస్తున్నాం ..త్వరలోనే మెదక్ లో మెడికల్ కళాశాల మంజూరు చేస్తామన్నారు.త్వరలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ను ప్రారంభిస్తామన్నారు. సీఎం కేసీఆర్ పేదలకు ఏది అవసరం ఉంటే ఆ పథకాలు ప్రవేశ పెడుతున్నారు. పదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదన్నారు. బిజెపి 400 ఉన్న సిలిండర్ ధర 1200 చేసింది. బీజేపీ పేదలను దోచి పెద్దలకు పంపిణీ చేస్తుంది.. తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి ..ఆలోచించాలి ఈ నెలలో మరో 200 ఇల్లు మంజూరు చేస్తాం అన్నారు మంత్రి హరీశ్ రావు.