Saturday, September 21, 2024

Minister తుమ్మల తో గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ చైర్మన్ సిన్హా భేటి

హైదరాబాద్ లో మంత్రి తుమ్మల నివాసం లో జీ.ఆర్.ఏం. బీ చైర్మన్ సిన్హా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో బుధవారం భేటీ అయ్యారు.ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులు పై నీటి కేటాయింపులు పై మంత్రి తుమ్మల చర్చించారు…..భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలకు తెగిన పెద్దవాగు ప్రాజెక్ట్ రీ డిజైన్ పై చర్చించారు……మూడు గేట్లు నుంచి ఆరు గేట్ల కు పెంచి 80 వేల క్యూసెక్కుల నీరు డిచ్చార్జ్ అయ్యేలా పెద్దవాగు ప్రాజెక్ట్ పునర్నిర్మాణం చేయాలని మంత్రి తుమ్మల కోరారు…..

.పెద్దవాగు ఉమ్మడి ప్రాజెక్ట్ గా ఉండటం తో ఏపి తెలంగాణ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం తో ప్రాజెక్ట్ పునర్నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేశారు. పెద్దవాగు పరిధిలో 16 వేల ఎకరాలు ఆయకట్టు ఉండగా ఎవ్వరీ పరిధిలో వారు కాలువల మరమ్మత్తులు వారే చేసే.విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు……

గోదావరి జలాల్లో తెలంగాణ నీటి వాటా హక్కులు కాపాడాలని రాష్ట్ర వాటాకు ఇబ్బందులు లేకుండా కేటాయింపులు అమలు చేయాలని ,ఇరు రాష్ట్రాలకు ఎలాంటి నీటి సమస్యలు లేకుండా చూడాలని , పెండింగ్ ప్రాజెక్ట్ ల పై గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ చైర్మన్ ఎం.కే సిన్హా తో సుదీర్ఘంగా చర్చించారు. ఏటా భారీగా గోదావరి జలాల వృధా అవుతున్నాయని.. అలా కాకుండా తెలంగాణ వినియోగించుకునేలా ఎలాంటి కార్యాచరణ చేపట్టవచ్చనే అంశాలపై చర్చించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement