Saturday, September 7, 2024

ఛలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి గంగుల

ఆగస్టు 7న ఢిల్లీలో జరిగే అఖిల భారత ఓబీసీ మహాసభ గోడ పత్రికను బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నారోజు రాకేష్ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో మంత్రిచే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారోజు రాకేష్ మాట్లాడుతూ.. విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో దామాషా ప్రకారం ప్రాతినిధ్యం దక్కాలనే నినాదంతో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రతి మూడు సంత్సరాలకు ఒకసారి దేశవ్యాప్తంగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించటానికి అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అలాగే త్వరలో జరిపే జనాభా లెక్కల్లో బీసీల జనగణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీ మహిళా వాటా తెలుపుతూ మహిళా బిల్లు ప్రవేశ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కావున జిల్లా నుండి అధిక సంఖ్యలో బీసీలు తరలివచ్చి ఈ మహసభను విజయవంతం చేయాలని పిలపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాచమల్ల రాజు, రాష్ట్ర కార్యదర్శి రంగు సంపత్ జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల సురేందర్, కాయితోజు బ్రహ్మచారీ, దుంపట మురళి, యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు సంజీవ్, నాయకులు బియ్యని తిరుపతి, బోయిని ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement